epaper
Tuesday, November 18, 2025
epaper

అందెశ్రీ మరణంపై ప్రధాని సంతాపం..

తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తన ప్రగాఢ సంతాపం తెలిపారు. సాంస్కృతిక, మోధో ప్రపంచంలో ఆయన మరణం పూడ్చలేని లోటని పేర్కొన్నారు మోదీ. ఈమేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా మోదీ తెలుగులో తెలిపారు. ‘‘అందె శ్రీ(Ande Sri) మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేని లోటు. ఆయన ఆలోచనలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఒక గొప్ప కవి, మేధావి అయిన ఆయన, ప్రజల పోరాటాలకు , ఆకాంక్షలకు ,అకుంఠిత స్ఫూర్తికి గొంతుకగా నిలిచారు. ఆయన పదాలకు హృదయాలను కదిలించే శక్తి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ఏకం చేసే శక్తి,ప్రజల సాంఘిక హృదయస్పందనకి రూపం ఇచ్చే శక్తి ఉన్నాయి. ఆయన సామాజిక స్పృహను,సాహితీ సౌందర్యంతో మిళితం చేసిన విధానం అద్వితీయం. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని మోదీ(PM Modi) రాసుకొచ్చారు.

ప్రముఖ రచయిత అందెశ్రీ.. సోమవారం ఉదయం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థత కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన తన నివాసంలోనే తనువు చాలించారు. అందెశ్రీ కి తెల్లవారిజుమునుండే బాగా నలతగా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో పల్స్ కొట్టుకోవటం బాగా పడిపోవటంతో స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వెంటనే కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జులై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెలకాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన ఆయన అందెశ్రీగా ఎదిగారు. ఒక అనాథగా తెలంగాణ తల్లి ఒడిలో పెరిగారాయన. ఎటువంటి చదువు లేదు. కానీ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడు కూడా పనిచేశారు. ఒకసారి ఆయన పాటలు పాడుతుంటే విన్న శృంగేరీ మఠం స్వామీ శంకర్ మహారాజ్.. అందెశ్రీని చేరదీశారు. ఆయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు ఆయన నంది అవార్డ్ అందుకున్నారు.

Read Also: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

Follow Us on: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>