Mobile Popup Ad
Mobile Popup Ad

సంచలనం.. ప్రధాని మోదీ హత్యకు కుట్ర?

కలం, వెబ్ డెస్క్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై హత్య కుట్రను బీహర్ పోలీసులు భగ్నం చేశారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బీహర్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నిందితుడు పంపిన ఒక ఈమెయిల్ ఆధారంగా అంతర్జాతీయ నిఘా సంస్థలు అప్రమత్తం కావడంతో ఈ కుట్రకోణం బయటపడింది. ప్రస్తుతం నిందితులను రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు.

22 రోజుల్లో హతమారుస్తానని ఈమెయిల్

22 రోజుల్లో ప్రధాని మోదీని (PM Modi) హతమారుస్తానని బీహర్ లోని బక్సర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల అమన్ తివారీ అమెరికా నిఘా సంస్థ సీఐఏకు మెయిల్ పంపించాడు. ప్రతిఫలంగా తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ సమాచారం అందిన వెంటనే అంతర్జాతీయ నిఘా వర్గాలు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. బక్సర్, దుమ్రాన్ పోలీసుల సంయుక్త బృందం రంగంలోకి దిగి.. అమన్ తివారీ ఇంటిపై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అతని గది నుంచి ఒక ల్యాప్ టాప్ తో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వెలుగులోకి షాకింగ్ విషయాలు

నిందితులపై పోలీసుల విచారణ ముమ్మరం అయింది. కాగా, అమన్ తివారీకి నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022లో అతను కోల్‌కతా విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడు. ఆ సమయంలో అతడు విదేశీ పరిచయస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు. మైనర్ కావడం వల్ల గతంలో అతడు తీవ్రమైన చర్యల నుంచి తప్పించుకున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం నిందితులను రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా? ఇది కేవలం డబ్బు కోసం చేసిన ఆకతాయి పనా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read Also: రేవంత్ బాటలో మోడీ.. ఆరు గ్యారంటీల జపం..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>