భారీ మోసానికి తెగబడ్డ గుంటూరు ఆక్స్ ఫర్డ్ కాలేజీ.. విద్యార్థుల ఆందోళన

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లా ఆక్స్ ఫర్డ్ కాలేజీ (Guntur Oxford College) భారీ మోసానికి పాల్పడింది. జేఈఈ మెయిన్స్‌ (JEE Mains)కు నకిలీ హాల్ టికెట్స్ ఇచ్చారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే పరీక్ష రాసేందుకు విద్యార్థులు వెళ్లగా.. వారి హాల్‌టికెట్స్ ఫేక్ హాల్‌టికెట్స్‌గా ఇన్విజిలేటర్లు గుర్తించారు. విద్యార్థుల ఆధార్ నెంబర్ల స్థానంలో వేరే ఆధార్ నెంబర్లు వేసి ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థులు.. ఆక్స్‌ఫర్డ్ కాలేజీ ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నీట్ ఎగ్జామ్ కోసం డబ్బులు తీసుకుని అప్లికేషన్ కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కెరీర్‌లో రెండు సంవత్సరాలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పలేదు.

Read Also: సంచలనం.. ప్రధాని మోదీ హత్యకు కుట్ర?

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>