నాలుగు రోజుల్లో సీమంతం.. వరకట్న వేధింపులతో గర్భిణి ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్ : పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మాయిలకు వరకట్నం రూపంలో చావు ఎదురవుతోంది. పెళ్లై సంవత్సరాలు గడుస్తున్నా అత్తామామలు కట్నం తేవాలంటూ వేధిస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో భర్త, అత్తింటి వారి వేధింపులు తాళలేక చాలా మంది మహిళలు బలవంతంగా తమ జీవితాలను ముగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ గుంటూరు (Guntur) జిల్లా తుమ్మపూడిలో చోటు చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో సీమంతం జరగాల్సి ఉండగా కల్యాణి అనే 5 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అత్తామామలు తమ బిడ్డను వరకట్నం కోసం వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గర్భిణి బలవన్మరణానికి పాల్పడడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Read Also: భారీ మోసానికి తెగబడ్డ గుంటూరు ఆక్స్ ఫర్డ్ కాలేజీ.. విద్యార్థుల ఆందోళన

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>