కలం, వెబ్ డెస్క్ : మావోయిస్టు కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ –PLGA) డిప్యూటీ కమాండ్ సోది కేశాలు (Sodi Keshalu) అలియాస్ మల్లా (Malla) పోలీసుల ఎదుట లొంగిపోయారు. మల్లాతో పాటు మరో 40మంది మావోయిస్టులు (Maoists Surrender) జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగుబాటు సమయంలో వారి దగ్గర ఉన్న ఏకే–47, ఎస్ఎల్‌ఆర్‌లతో సహా 50 వరకు ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, కేంద్ర మంత్రి అమిత్ షా వార్నింగ్ తో పాటు, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకంతో మావోయిస్టులు జనజీవన స్రవంతి (Maoists Surrender) లో కలుస్తున్నట్లు సమాచారం. కాగా, సోది కేశాలు లొంగిపోవడంతో తెలంగాణలో మావోయిస్టు కేడర్ సంఖ్య పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. PLGA చీఫ్ బడిసె దేవా గతంలోనే లొంగిపోగా.. తాజాగా ఆ పార్టీ డిప్యూటీ కమాండర్ మల్లా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన మల్లాతో సహా దళాలను కొద్దిరోజుల్లోనే పోలీసు ఉన్నతాదికారుల మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
Read Also: ప్రియుడితో జంప్.. పోలీసుల ముందే భార్యను కడతేర్చిన భర్త
Follow Us On : WhatsApp

