కలం, వెబ్ డెస్క్: మార్కెట్‌లో కొందరు వ్యాపారులు కల్తీ ఫుడ్‌ను (Adulterated Food) విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే ఎవరికీ లెక్కే లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లో తరచూ కల్తీ ఫుడ్ ఘటనలు బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇలాకాలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాకినాడ జిల్లా పిఠాపురం (Pithapuram)లో ఓ బేకరీలో బిస్కెట్లలో పురుగులు ఉన్నా అలాగే అమ్మేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురంలోని జీవన్ నగర్ కాలనీకి చెందిన డేవిడ్ అనే వ్యక్తి ఓ బేకరీలో బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి తన కొడుక్కి ఆ బిస్కెట్లు తినిపిస్తూ ఉండగా అందులో పురుగులు చూసి షాకయ్యాడు.
బేకరీకి వెళ్లి యాజమాన్యాన్ని ప్రశ్నించగా అక్కడ ఉన్న వాళ్లు పొంతన లేని సమాధానం చెప్పారు. బిస్కెట్లపై కనీస వివరాలు, ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేయలేదని డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థానికులతో కలిసి బేకరీని మూసివేసి షాప్ ఎదుట ఆందోళన చేశారు. పిఠాపురంలో (Pithapuram) భారీగా కల్తీ ఫుడ్ విక్రయాలు జరుగుతున్నాయని, పాడైన ఆహారాన్ని కూడా అలాగే అమ్మేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సక్రమంగా తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?
Follow Us On: WhatsApp

