కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) బర్త్ డే సందర్భంగా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎక్స్ వేదికగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబుకు ఎంతో మంది విషెస్ చెప్తున్నప్పటికీ మావయ్య గారూ అంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఏపీ సీఎం, మావయ్య గారైన చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. చంద్రబాబు నిరంతరం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, తనదైన దార్శనికతతో, అంకితభావంతో ప్రజలకు సేవ చేసే శక్తిని భగవంతుడు ఆయనకు అందించాలని ప్రార్థించారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి నిరంతరం స్ఫూర్తినివ్వాలని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
చంద్రబాబు, ఎన్టీఆర్ (NTR) మధ్య కుటుంబ విబేధాలు ఉన్నాయంటూ తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ మధ్య ఓ టీడీపీ నేత ఎన్టీఆర్‌ను తిట్టిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చంద్రబాబు సహా టీడీపీ పెద్దలు ఎవరూ ఖండించలేదని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పేందుకు తరచూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు చంద్రబాబు బర్త్ డే సందర్భంగా చేసిన పోస్ట్‌తో మరోసారి ఎన్టీఆర్ తమ ఫ్యామిలీలో ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పేందుకు ట్రై చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Read Also: తెలంగాణను వ్యతిరేకిస్తే.. మూల్యం చెల్లించాల్సిందేనా?
Follow Us On: WhatsApp

