కలం వెబ్ డెస్క్ : కెనడా(Canada)లోని టొరంటో(Toronto)లో మరో భారతీయ విద్యార్థి(Indian student) కాల్పుల్లో మరణించాడు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్‌బరో క్యాంపస్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో శివాంక్ అవస్థి(Shivank Awasthi) ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 23న మధ్యాహ్నం ఓల్డ్ కింగ్‌స్టన్ రోడ్ ప్రాంతంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ శివాంక్ అప్పటికే మృతి చెందాడు. నిందితులు పోలీసులు రాకముందే అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ సంఘటనతో క్యాంపస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. దర్యాప్తు కోసం తాత్కాలికంగా యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్‌బరో క్యాంపస్‌ను మూసివేశారు. ఈ దారుణ ఘటనపై టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపింది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇటీవల కెనడాలో (Canada) భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.
Read Also: నేటి నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు
Follow Us On: Youtube


