కలం, వెబ్ డెస్క్ : బీహార్ (Bihar) ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన నితీశ్ కుమార్(Nitish Kumar) కీలక రాజకీయ పరిణామంలో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా (Rajya Sabha Member) ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమం దేశ రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సమక్షంలో నితీశ్ కుమార్ హిందీలో ప్రమాణం చేశారు. ఈ వేడుకకు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.
రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) భాద్యతలు స్వీకరించిన నేపధ్యంలో.. త్వరలోనే ఆయన బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీహార్ రాజకీయాల్లో ఇప్పటికే కీలక స్థానాన్ని సంపాదించిన ఆయన, ఇప్పుడు కేంద్ర స్థాయిలో కూడా తన ప్రభావాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నితీశ్ కుమార్ రాజ్యసభ ప్రవేశం రాజకీయ సమీకరణాల్లో మార్పులకు దారితీయొచ్చనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాబోయే కాలంలో జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్
Follow Us On: Sharechat

