కలం, వెబ్ డెస్క్: యాంకర్ శ్యామల (Anchor Syamala) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం పదవుల కోసమే రాజకీయాల్లోకి రాలేదని, జగనన్నపై ఉన్న అభిమానంతోనే పార్టీ కోసం పనిచేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల తనపై వస్తున్న కొన్ని పుకార్లను కొట్టిపారేస్తూ, తనను వైఎస్సార్‌సీపీ (YCP) నుంచి దూరం చేయడం ఎవరి వల్ల కాదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి కష్టకాలంలో కూడా అండగా ఉంటానని, జగన్ నాయకత్వంలోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆమె క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు. ప్రత్యర్థుల విమర్శలను తాను ఏమాత్రం పట్టించుకోనని శ్యామల తేల్చిచెప్పారు. ప్రస్తుతం శ్యామల కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

