epaper
Wednesday, February 18, 2026
epaper

మాంచెస్టర్ సిటీ ఆట నచ్చట్లేదన్న కోచ్..

కలం, డెస్క్ : ఫుట్‌బాల్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్(FA CUP)లో మాంచెస్టర్ సిటీ ఆటతీరుపై ఆ జట్టు కోచ్ పెప్ గ్వార్డియోలా (Pep Guardiola) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీ నాలుగో రౌండ్‌లో మాంచెస్టర్ గెలిచినా.. జట్టు ఆటతీరు తనకు నచ్చట్లేదంటూ గ్వార్డియోలా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిటీ 2-0తో గెలిచి తదుపరి రౌండ్‌కు చేరినా, ఆట ఆశించిన స్థాయిలో లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎఫ్ఏ కప్ ఫోర్త్ రౌండ్‌లో లీగ్ 2 జట్టు సాల్‌ఫోర్డ్ సిటీ (Salford City)కి మాంచెస్టర్ సిటీ తమ సొంత మైదానం ఎటిహడ్ స్టేడియంలో ఆతిథ్యం ఇచ్చింది. మ్యాచ్ ఆరంభంలోనే ఆరో నిమిషంలో టోటెన్హామ్ లోనీ ఆటగాడు ఆల్ఫీ డారింగ్‌టన్ చేసిన ఓన్ గోల్‌తో మాంచెస్టర్ సిటీ (Manchester City) ముందంజ వేసింది. ఆ తర్వాత చాలా అవకాశాలు సృష్టించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 81వ నిమిషంలో మార్క్ గేహి గోల్ చేసి స్కోరును 2-0కి పెంచాడు. దీంతో సిటీ విజయాన్ని ఖాయం చేసుకుంది.

మ్యాచ్ అనంతరం స్పందించిన గ్వార్డియోలా (Pep Guardiola), ప్రత్యర్థులు వదిలిన ఖాళీలను తమ ఆటగాళ్లు సరిగ్గా చదవలేకపోయారని తెలిపారు. అదే కారణంగా ఆట బోరింగ్‌గా మారిందని చెప్పారు. గెలుపే ఒక్క మంచి విషయం అని పేర్కొన్నారు. ఇటీవలి రెండు, మూడు వారాలు కష్టంగా గడిచాయని, అయినా క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులకు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తోందని వివరించారు. స్పేస్‌లను గుర్తించలేకపోవడంతో ఆట ఫ్లాట్‌గా, నెమ్మదిగా సాగిందని ఆయన విశ్లేషించారు.

Read Also: వరల్డ్ కప్‌లో భారత్ ప్రతి ఒక్కరికీ సింహస్వప్నం: స్టార్క్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>