కలం, వెబ్ డెస్క్: ప్రపంచకప్‌లో ప్రతి జట్టుకు భారత్ జట్టు సింహ స్వప్నంలా మారిందంటూ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిఛెల్ స్కార్క్(Mitchell Starc) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ప్రస్తుతం అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తోందని అన్నాడు. అందుకే భారత్‌ను చూసి చాలా జట్లు వణుకుతున్నాయని స్టార్క్ కొనియాడాడు. వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.
ముందుగా ప్రపంచ క్రికెట్‌పై పూర్తి ఆధిపత్యం చూపింది ఆస్ట్రేలియా జట్టేనని స్టార్క్ గుర్తు చేశారు. ఆ రోజుల్లో ప్రత్యర్థి జట్లు ఆసీస్‌ను ఎదుర్కోవాలంటేనే ఒత్తిడికి లోనయ్యేవని తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని, అదే స్థాయి ప్రభావాన్ని ప్రస్తుతం భారత జట్టు చూపుతోందని ఆయన (Mitchell Starc) అభిప్రాయపడ్డారు.
భారత్‌ను ఎదుర్కోవడం పెద్ద సవాల్
టీ20 వరల్డ్‌కప్ 2026 (T20 World Cup) నేపథ్యంలో స్పందించిన స్టార్క్, భారత జట్టు అద్భుతంగా ఆడుతోందని పేర్కొన్నారు. గతంలో ఆస్ట్రేలియాను చూసి ఇతర జట్లు భయపడేవని, ఇప్పుడు టీమిండియాను చూసి మిగతా జట్లు ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో భారత్‌ను ఎదుర్కోవడం చాలా జట్లకు పెద్ద సవాలుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో బ్యాలెన్స్‌డ్‌గా ఉందని చెప్పారు. అంతేకాదు, బలమైన బెంచ్ స్ట్రెంగ్త్ ఉండటం వల్లే ఈ స్థాయి ఆధిపత్యం సాధ్యమవుతోందని వివరించారు.
టీమిండియా బలం అదే..
ప్రస్తుతం భారత జట్టు యువ ఆటగాళ్లు, సీనియర్ల సమన్వయంతో బలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని విజయాలు సాధించే సామర్థ్యం పెరగడం కూడా జట్టు విజయాలకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మద్దతు, బలమైన దేశీయ క్రికెట్ వ్యవస్థ కూడా టీమిండియా ఎదుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. ఒకప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన ఆస్ట్రేలియా స్థానాన్ని ఇప్పుడు భారత్ ఆక్రమించిందని స్టార్క్ చేసిన వ్యాఖ్యలు భారత జట్టు ప్రస్తుత ఫామ్‌కు నిదర్శనంగా భావిస్తున్నారు.
Read Also: పేదలకు ఇక భూములివ్వలేం : సీఎం రేవంత్‌రెడ్డి
Follow Us On : WhatsApp


