డైరెక్ట‌ర్ బుచ్చిబాబు బ‌ర్త్‌డే.. రామ్‌చ‌ర‌ణ్ స్పెష‌ల్ పోస్ట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: నేడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు (BuchiBabu) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఆయ‌న‌కు స్పెషల్ విషెస్ తెలిపారు. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ పెద్ది (Peddi) సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విషెస్ చెప్తూ రామ్ చ‌ర‌ణ్ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్ట్ చేశారు. నా పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. సెట్‌పై ప్రతి రోజూ మీరు చూపించే ఆస‌క్తి, ప్రతి అంశంలో చూపే శ్రద్ధ, ఎంతో వివ‌రంగా మీరు చెప్పే క‌థ‌నం స్ఫూర్తినిస్తాయ‌ని పేర్కొన్నారు.

ఇద్ద‌రం క‌లిసి ఇంకా గొప్ప ప్రాజెక్టుల్లో ప‌ని చేద్దామంటూ రాసుకొచ్చారు. ఈ ఏడాది బుచ్చిబాబు కష్టానికి తగిన గుర్తింపు, విజయాలు అన్నీ ద‌క్కాల‌ని హృదయపూర్వకంగా కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. రామ్‌చ‌ర‌ణ్‌ (Ram Charan), బుచ్చిబాబు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న పెద్దిపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ న‌టించింది. ఈ సినిమా వ‌చ్చే ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>