Mobile Popup Ad
Mobile Popup Ad

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి: సుడా ఛైర్మన్

కలం , కరీంనగర్ బ్యూరో : సుడా పనులపై ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్, కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ కూడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో  పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని కొత్త పనులకు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఛైర్మన్ ఆదేశించారు. సుడా కమర్షియల్ బిల్డింగ్ మొదటి విడత పనులు చివరి దశకు వచ్చాయన్నారు. ఆ పనులు పూర్తి కాగానే మిగతా పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు.

రాజీవ్ చౌక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం, రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులు ఐడిఎస్ఎంటి, వర్టికల్ గార్డెన్లు తదితర పనులను మే 21 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీటిని మే 21 న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథులచే ప్రారభించుకుందామని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ శివానంద్ ,డిఈఈ లు రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఎఈఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. ఖర్గేకు నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>