వరంగల్ సీపీ కీలక నిర్ణయం.. 9 మంది ఎస్ఐలు బదిలీ!

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) పోలీస్ కమిషనర్ పరిధిలో ఎస్ఐలు బదిలీఅయ్యారు. వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఎస్ఐలు (Sub Inspectors), కమిషనర్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని, సంబంధిత ఎస్ఐలు వెంటనే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాలని కమిషనర్ ఆదేశించారు. సాధారణంగా పరిపాలనా పరమైన మార్పుల దృష్ట్యా ఇలాంటి బదిలీలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోనూ బదిలీ ప్రక్రియ జరిగింది.

తొమ్మిది మంది వీరే..
  • సాయి ప్రసన్న కుమార్
  • వి. గోవర్ధన్
  • జి. రామ్ మోహన్
  • రఘుపతి
  • నర్సింహారావు
  • ఎ. ప్రవీణ్ కుమార్
  • ఎ. శ్రీకాంత్
  • ఎస్.కె. హమీద్
  • బి. మాంగ

Read Also: హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>