కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. నిన్న చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. మోదీ వంటి ఉగ్రవాదితో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమని.. ఈసీకి (EC) ఫిర్యాదు చేశారు. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీ సంతృప్తి చెందకపోతే.. తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈసీ తీరుపై కాంగ్రెస్ విమర్శలు..
ఖర్గేకు (Mallikarjun Kharge) ఈసీ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ అధ్యక్షుడి వ్యాఖ్యలను కొందరు దురుద్దేశపూర్వకంగా వక్రీకరించారని వివరించారు. ఖర్గే వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఈసీ.. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ దూరదర్శన్ వంటి ప్రభుత్వ ఛానళ్లలో ప్రజలను ఉద్దేశించి ఎలా ప్రసంగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఓటర్లను ప్రభావితం చేయడం కాదా.. దీనిపై తాము ఫిర్యాదు చేసినా ఎందుకు ఇంతవరకు పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
Read Also: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం
Follow Us On: Sharechat

