epaper
Tuesday, November 18, 2025
epaper

మాగంటి సునీతపై కేసు నమోదు..

జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత(Maganti Sunitha)పై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించిందని, తమ పార్టీ గుర్తు కారు ఉన్న ఓటర్ స్లిప్‌లను వారు పంపిణీ చేస్తున్నారని మోహన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాగంటి సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే కాంగ్రెస్ చేస్తున్నవన్నీ కూడా అసత్య ప్రచారాలని, మాగంటి సునీత ఆత్మవిశ్వాన్ని దెబ్బతీయడం కోసం తప్పుడు కేసులు పెట్టిస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉపఎన్నికలో తాము గెలవమని తెలియడంతోనే కాంగ్రెస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత(Maganti Sunitha)పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతూ వ్యవహరిస్తున్నారని అన్నారు.

Read Also: బీజేపీ, బీఆర్ఎస్ ఎంట్రీతో బెడిసి కొట్టిన కాంగ్రెస్ వ్యూహం..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>