Mobile Popup Ad
Mobile Popup Ad

కస్టమ్స్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా లైశెట్టి అఖిల్ కృష్ణ

కలం, కరీంనగర్ బ్యూరో: కస్టమ్స్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా పెద్దపల్లి (Peddapalli) వాసి లైశెట్టి అఖిల్ కృష్ణ ఎంపికయ్యారు. భారత ప్రభుత్వం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో 390 మార్కులకు గాను 333 మార్కులు సాధించిన అఖిల్ ఓపెన్ క్యాటగిరిలో కస్టమ్స్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఎంపికయ్యారు. అఖిల్ ప్రాథమిక స్థాయి నుంచి హై స్కూల్ వర‌కు పెద్దపల్లిలో విద్యను అభ్యసించారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి అనంతరం చెన్నైలోని వెల్ టెక్ యూనివర్సిటీలో ఉన్న‌త‌ విద్యను అభ్యసించారు. 2025లో గ్రూప్ 4 పరీక్షలో ఎన్నికై ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ బిక్షపతి కుమారుడైన‌ అఖిల్ కృష్ణ కస్టమ్స్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ఎంపికవడం పట్ల పెద్దపల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>