Mobile Popup Ad
Mobile Popup Ad

ములుగు జిల్లాలో ప్రమాదం: కూలీల ఆటోను ఢీకొట్టిన లారీ

కలం, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లా వెంకటాపురం (Venkatapuram) మండలం వెలుతుర్లపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన ఒక లారీ అతివేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న కూలీలు అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా గంటోజు సుగుణ, కడారి శ్రీలత అనే ఇద్దరు మహిళా కూలీల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు అక్కడ చికిత్స పొందుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>