పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.. ఎమ్మెల్యే విజయరమణ రావు

కలము, కరీంనగర్ బ్యూరో :  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే (Peddapalli MLA) చింతకుంట విజయరమణ రావు(Vijaya Ramana Rao) తెలిపారు. సోమవారం పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ (SFC) నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న డీఆర్‌సీసీ, కంపోస్టింగ్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసి, వనమహోత్సవంలో భాగంగా మొక్కలను అందజేశారు. కంపోస్టింగ్ షెడ్ నిర్మాణాన్ని రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జెండా చౌరస్తా నుంచి మసీద్ చౌరస్తా వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను దసరా నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం

సుల్తానాబాద్ పట్టణంలోని 15వ వార్డు పూసాల, పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి, 27వ వార్డు సుభాష్‌నగర్, 25, 33 వార్డుల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ సొంతింటి కలను నెరవేరుస్తోందన్నారు. పెద్దపల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న దాదాపు 370 ఇందిరమ్మ ఇళ్లను దసరా, దీపావళి నాటికి ప్రారంభానికి సిద్ధం చేస్తామని తెలిపారు.

త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, అర్హులైన ఆర్పీలకు కూడా ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయరమణ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలలో  పద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఆర్పీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>