ఫిర్యాదులపై తక్షణ చర్యలు.. వనపర్తి ఎస్పీ ఆదేశం

కలం, వనపర్తి: ప్రజలు ఎలాంటి భయాందోళనలు, పైరవీలకు తావులేకుండా నేరుగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ (Wanaparthy SP) సునితారెడ్డి (Sunitha Reddy) సూచించారు. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా విన్న ఆమె.. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలు మధ్యవర్తులు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపడం, జిల్లాలో శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణిలో స్వీకరించిన 13 ఫిర్యాదుల్లో మూడు భూ తగాదాలు, మూడు భార్యాభర్తల మధ్య సమస్యలు, ఏడు పరస్పర గొడవలకు సంబంధించినవిగా పోలీసు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>