మూడు టిమ్స్ ఆసుపత్రులకు కొత్త పేర్లు ప్రకటన

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రులకు (TIMS Hospitals) కొత్త పేర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రికి మాజీ సీఎం అంజయ్య పేరు, ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రికి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ నగరంలోని టిమ్స్ ఆసుపత్రికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టబోతున్నట్లు తెలిపారు. మూసారంబాగ్ వద్ద నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. అక్కడ జరుగుతున్న బహిరంగ సభలో ఈ మేరకు ప్రకటించారు. ఇటీవలే ప్రారంభించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రికి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టిన విషయం విదితమే.

రక్తాన్ని కూడా అమ్మేశారు..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజల గురించి తన కుటుంబం కోసమే ఆలోచించి వారికి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చివరికి పార్టీ నేతల రక్తాన్ని కూడా అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని మూడు కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తోందన్నారు. కేసీఆర్ (KCR) సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు.

Also Read : నల్లగొండలో ఉద్రిక్తత.. మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>