Mobile Popup Ad
Mobile Popup Ad

పాలకుర్తి నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్

కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Koya Sriharsha) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి జూన్ 10 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యాలయ నిర్వహణకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, తాగునీటి తదితర మౌలిక సదుపాయాలను కూడా అదే గడువులో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అధికారులు తరచూ పనులను పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ (Collector Koya Sriharsha) తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయ భవనం అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఈఈ పీఆర్ శంకరయ్య, తహసీల్దార్ సునీత ఉన్నారు.

Read Also: ఖమ్మంలో హీట్‌వేవ్‌పై మంత్రి పొంగులేటి సమీక్ష!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>