Mobile Popup Ad
Mobile Popup Ad

ఉద్యోగం పేరుతో మోసం.. డబ్బులు అడిగితే మహిళపై దాడి

కలం, వెబ్ డెస్క్ : ఉద్యోగం పేరుతో ఓ మహిళను దారుణంగా మోసం చేశాడు ఓ వ్యక్తి. డబ్బులు తీసుకుని ఉద్యోగంలో పెట్టించకపోతే.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళ నిలదీసింది. దీంతో తిరిగి మహిళపైనే దాడి చేశాడు సదరు వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ (Nashik) శివాజీనగర్ లో చోటు చేసుకుంది. 32 ఏళ్ల మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. రోజులు, నెలలు గడుస్తున్నా సరే ఉద్యోగం ఇప్పించట్లేదు.

దీంతో సదరు మహిళ తన డబ్బులు ఇవ్వాలంటూ కోరింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయింది. దీంతో మహిళపై దారుణంగా దాడి చేశాడు ఆ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మోసం చేయడమే కాకుండా మళ్లీ దాడి చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>