కలం, కరీంనగర్ బ్యూరో : ఇల్లంతకుంట (Ellanthakunta) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ఫ్యాక్స్) చైర్మన్ గా వుట్టుకూరి వెంకట రమణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా, స్థానిక మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆరోగ్య ప్రదాత డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉత్తర్వులను అందుకున్నారు.
సెస్ డైరెక్టర్ గా, ఎంపీపీగా గతంలో బాధ్యతలు
గతంలో ఉట్కురి వెంకట రమణారెడ్డి సెస్ డైరెక్టర్ గా గెలుపొంది సెస్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా తన వంతుగా కృషిచేశారు. అనంతరం పదవీకాలం ముగియడంతో, సోమారం పేట, గొల్లపల్లి, వెంకటరావుపల్లి, జంగారెడ్డి పల్లె, ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొంది, మండల ప్రజా పరిషత్ (ఎంపీపీగా) బాధ్యతలు చేపట్టారు. అప్పటినుండి మండలంలో మంచి ప్రజాప్రతినిధిగా ,డైనామిక్ లీడర్ గా గుర్తింపు పొందారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విధేయుడిగా ముద్ర
గతంలో టీఆర్ఎస్లో పనిచేసిన వుట్కూరు వెంకటరమణారెడ్డి గారు, ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుండి నిరంతరం శ్రమిస్తూ, ఎమ్మెల్యే గెలుపు కోసం తనవంతుగా మండలంలో, నియోజకవర్గంలో విస్తృతంగా తనవంతు ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు గెలుపొందారు. అప్పటినుండి ఇచ్చిన మాట కట్టుబడి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఉట్కూరి వెంకట రమణారెడ్డి గారికి రిజర్వేషన్ అనుకూలించడంతో ఫ్యాక్స్ చైర్మన్ గా అవకాశము కల్పించారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఉట్కూరి వెంకటరమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

