కలం, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత రాజకీయ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పు చేశారని మంత్రి విమర్శించారు. ఆనాడు మళ్లీ టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజలు ఈ బాధలు ఉండేవి కాదన్నారు. ఇది తన వ్యక్తిగతమని, పార్టీకి, ముఖ్యమంత్రికి దీనితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆనాడు అసెంబ్లీ నిర్వహణ దారుణంగా ఉండేదని అచ్చెన్నాయుడు చెప్పారు.
అసెంబ్లీకి వస్తే లైట్లన్నీ ఆర్పేశారని, చంద్రబాబు (Chandrababu) ఛాంబర్‌లో కూర్చుంటే అక్కడా లైట్లు ఆర్పేశారని, అసెంబ్లీలో ఉండకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఆనాడు అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అనరాని మాటలు అన్నారని, అవన్నీ వింటూ కూడా చంద్రబాబు ఎంతో ఓపికతో ఉన్నారని, ఆయన ఓపికకు జోహార్ అని వ్యాఖ్యానించారు. ఆనాడు వైసీపీ వాళ్లు అసెంబ్లీలో అన్న మాటలకు తన చేతిలో గన్ ఉంటే కాల్చి పారేయాలన్నంత కోపం వచ్చిందని మంత్రి (Atchannaidu) అన్నారు.
Read Also: భారతి సిమెంట్స్‌కు బిగ్ షాక్: గనుల లీజు రద్దు?
Follow Us On: Facebook

