కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ దక్కింది. తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లోకేశ్ కు అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతలతో సఫలీకృతం కావాలని, కూటమి స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. అలాగే, టీడీపీ ఏపీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాస రావుకు కూడా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురు, జాతీయ ఉపాధ్యాక్షులుగా 18 మంది, అధికార ప్రతినిధులుగా 10 మందిని పార్టీ నియమించింది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కనివారితో పాటు సీనియర్లకు పార్టీ పదవులు కట్టబెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళికలో భాగంగా టీడీపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గాలను నియామకం చేసింది.
Read Also: పొలిటికల్ యాత్రలతో ఓట్లు రాలేనా?
Follow Us On : WhatsApp

