Mobile Popup Ad
Mobile Popup Ad

టీవీకే చీఫ్ విజయ్‌పై కేసు నమోదు

కలం, వెబ డెస్క్​ : తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ (TVK Vijay)పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల నగరంలో ఆయన నిర్వహించిన భారీ రోడ్‌షోలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసకున్నారు.

చెన్నైలోని మాంబలం ప్రాంతంలో నిర్వహించిన ఈ రోడ్‌షోకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే, ముందస్తు అనుమతులకు భిన్నంగా వ్యవహరించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి అంశాలను అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాంబలం పోలీస్ స్టేషన్‌లో విజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Read Also: రాజ్యాంగ సవరణ బిల్లు: లోక్‌సభలో డివిజన్ ఓటింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>