షాకింగ్.. ఆ విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్ భార్య!

కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా (Anna Lezhneva) ఇటీవల ఇన్ స్టా లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ కు ఉంటూ అభిమానులతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషల్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమ, పెళ్లి, అభిరుచులు వంటి అంశాలపై ఆమె సంచలన విషయాలను బయటపెట్టారు. ఆమె చెప్పిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా లవ్ స్టోరీపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు మొదట ప్రపోజ్ చేశారు? అని అడగ్గా.. ముందు పవన్ కళ్యాణే తనకు ప్రపోజ్ చేశారని ఆమె చెప్పేసింది. దీంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అన్నా లెజినోవాల (Anna Lezhneva) లవ్ స్టోరీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీపై క్లారిటీ వచ్చేసిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కు తన అత్తమ్మ (పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి) చేసే మాసాల చికెన్ కూర అంటే అమితమైన ఇష్టమని చెప్పారు. ఆ రెసిపీని కూడా తాను అత్తమ్మ దగ్గరే నేర్చుకున్నట్లు తెలిపారు. అలాగే సురేఖమ్మ చేసే చేపల పులుసు కూడా పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం తనకు మొత్తం 6 భాషలు వచ్చని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. అయితే తాను కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ భాషలో మాట్లాడటానికే ఎక్కువగా మొగ్గు చూపుతానని స్పష్టం చేశారు. తనకు తెలుగు అంటే అమితమైన ఇష్టమని.. ప్రతి రోజూ కొంచెం కొంచెంగా తెలుగు నేర్చుకుంటున్నానని అన్నా లెజినోవా వెల్లడించారు. తాను తన అత్తమ్మ దగ్గరే చాలా వంటలు నేర్చుకున్నానని.. ఇప్పుడు దోస, ఇడ్లీ, చట్నీలతో పాటు పప్పులు, కూరలు కూడా చేయగలను అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు.

Read Also: కంటి ఇన్ఫెక్షన్లకు ఇక మందులు కూడా పనిచేయవా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>