కలం, కరీంనగర్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శనివారం ఉదయం కొండగట్టులోని (Kondagattu) ఆంజనేయస్వామి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. గతంలో 2024 ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ కొండగట్టులోనే తన ప్రచార వాహనం వారాహికి (Vaarahi) పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన పవన్ కల్యాణ్ తొలిసారి కొండగట్టుకు వచ్చారు.
గతంలో కొండగట్టు అభివృద్దికి కృషి చేస్తానని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన మాట మేరకు కొండగట్టు అభివృద్దికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిధులు రూ.35 కోట్లు కేటాయించడానికి సిఫార్సు చేశారు. దీనికి టీటీడీ పాలకవర్గం అనుమతి లభించింది. ఇటీవల టీటీడీ అధికారులు కొండగట్టులో పర్యటించి భక్తుల వసతి కోసం 100 గదుల నిర్మాణంతో పాటు కొండగట్టులో హనుమాన్ మాలధారణ భక్తులకు ప్రత్యేక షెడ్ నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ నిధులతో కొత్తగా చేపట్టే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also: స్టార్ బ్యాటర్‌కు గాయం.. ఇక ఐపీఎల్‌లోనే!
Follow Us On: Youtube


