కలం, వెబ్ డెస్క్: భారత యువ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)కు తీవ్ర గాయమైంది. విజయ్ హజరే ట్రోఫీలో తమిళనాడు తరుపున ఆడుతూ.. పరుగుల వరద పారిస్తున్నాడు ఈ యంట్ బ్యాటర్. ఇంతలో గాయమవడం తమిళనాడు జట్టుకు మైనస్ అనే చెప్పాడు. గతేడాది టీమిండియా తరుపు అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా సుదర్శన్ సునామి సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి గాయపడ్డాడు.
బ్యాటింగ్ సమయంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసే క్రమంలో పరుగు కోసం డైవ్ చేసిన సమయంలో అతడికి దెబ్బ తగిలింది. వెంటనే ఫిజియోలు సాయి సుదర్శన్‌ను బెంగళూరులోని బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల్లో సాయి సుదర్శన్ కుడి వైపు ఏడవ పక్కటెముక ముందు భాగంలో చిన్నపాటి చీలిక ఉన్నట్లు స్పష్టమైంది. విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా అదే ప్రాంతంలో అతడికి దెబ్బ తగిలినట్లు సమాచారం.
ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో విజయ్ హజారే ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు సాయి సుదర్శన్ దూరం కానున్నాడు. 24 ఏళ్ల ఈ బ్యాటర్ ఐపీఎల్ 2026 సీజన్‌తో మళ్లీ మైదానంలోకి వచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు లోవర్ బాడీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ట్రైనింగ్ అందిస్తున్నామని సీఓఈ తెలిపింది. శరీరం ఈ వ్యాయామాలకు బాగా స్పందిస్తోందని, నొప్పి తగ్గిన తర్వాత అప్పర్ బాడీ ట్రైనింగ్ (Training) ప్రారంభిస్తామని వివరించింది. ఆ తర్వాత పూర్తి స్థాయి శిక్షణ ఇస్తామని వెల్లడించింది.


