ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారుపై పడ్డ సిమెంట్ ట్యాంకర్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా (NTR District)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కీసర టోల్ గేట్ (Keesara Toll Gate) దాటుతున్న సందర్భంలో కారుపై సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ బోల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్నపోలీసులు జేసీబీల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే, ట్యాంకర్ బరువు ఎక్కువగా ఉండడంతో రెస్య్కూ చేయడం కష్టంగా మారింది. ఘటనా స్థలానికి అంబులెన్సులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. TS 09 FT 6662 నెంబర్ తో ఉన్న కారు బీ. శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయింది. కాగా, సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఓనర్ బీ.శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు.

Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>