epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మహిళలతోనే మార్పు సాధ్యం: పవన్

మార్పు అనేది మహిళలతోనే సాధ్యమవుతుందని ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. అది సమాజంలో అయినా, మన ఆలోచనలో అయినా అని అన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది(Aame Suryudini Kabalinchindi)’ అనే పుస్తక ఆవిష్కరణలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై పుస్తకాల ప్రభావం చాలా ఉందని పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని చెప్పారు. అన్ని అంశాలపై తాను లోతుగా పరిశీలన చేస్తానని, ఆ తర్వాతే ఒక అభిప్రాయానికి వస్తానని చెప్పారు. ‘ఆమె సూర్యుడిని కబళించింది’ అంటే ఎంతో శక్తివంతురాలు అని అర్థమని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. మనం సాధించాలి అనుకుంటే సూర్యుడిని సైతం మింగేయగలమని ఈ పుస్తకం చెప్తుందన్నారు.

‘‘మనం మామూలుగా మిస్టర్ అండ్ మిసెస్ అంటాం. కానీ, భారతీయ సంస్కృతిలో మహిళలకే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వారు తలుచుకుంటే దేనినయినా మార్చేస్తారు. ఓజీ అంటే ఏమిటి అని ఎలా చూశారో.. పుస్తకం టైటిల్ కూడా ఉత్సకతను రేకెత్తించేలా ఉందన్నారు. ఐఎఫ్‌ఎస్ చదువుకున్న లక్ష్మీ నుంచి ఇలాంటి పుస్తకం రావడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. స్వాంతంత్ర్య సంగ్రామ సమయంలో దీరోదాత్త వనిత మాలతి పోరాటాన్నిఈ పుస్తకంలో ప్రస్తావించారన్నారు. మనం పూజించేది దుర్గాదేవిని.. ప్రతి మహిళను తాను అలా దుర్గాదేవిగా చూస్తానని Pawan Kalyan చెప్పారు.

Read Also: అమరావతి రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>