తిరుపతి(Tirupati) జిల్లా రేణిగుంటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను చూసి నవ్వినందుకు ఓ బాలుడిని ఓ వ్యక్తి అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. భార్య వదిలి వెళ్లిపోవడంతో తనను చూసి అంతా నవ్వుతున్నారని నిందితుడు తీవ్ర అవమానంతో రగిలిపోతున్నాడు. అందరిలా తనను చూసిన బాలుడిపై అతడు తన ప్రతాపం చూపించాడు. అతి కిరాతకంగా నరికి హతమార్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రేణిగుంట సంత సమీపంలోని గువ్వల కాలనీకి చెందిన పూసలు అమ్ముకునే మేస్త్రీ భార్య ఇటీవల అతనిని వదిలి వెళ్లిపోయింది. ఆ కారణంగానే అంతా తనను చూసి నవ్వుతున్నారని అతను అనుకున్నాడు.
Tirupati – Renigunta | అదే ప్రాంతానికి చెందిన శ్రీహరి(17).. తనను చూసి హేళనగా నవ్వాడని బుధవారం శ్రీహరిని కొట్టాడు. ఆ విషయం తెలుసుకున్న శ్రీహరి తండ్రి గురువారం ఉదయం నిందితుడి దగ్గరకు తన కుమారుడిని తీసుకుని వెళ్లి ప్రశ్నించాడు. తండ్రి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాలుడికి, నిందితుడికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. పూసల దారాలు కత్తిరించే కత్తితో శ్రీహరి మెడపై దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీహరి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
Read Also: మహిళలతోనే మార్పు సాధ్యం: పవన్

