తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందని.. ప్రస్తుతం సరిపడా సరఫరా కావడం (Telangana Fuel Supply) లేదని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి రాష్ట్రంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) చెక్ పెట్టాయి. తెలంగాణలో ఎక్కడా ఎలాంటి ఇంధన కొరత లేదని, సరఫరా సాఫీగా సాగుతోందని ప్రకటన చేశాయి. ఇంధనం, గ్యాస్ సరఫరాను ప్రభుత్వ రంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని.. రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు. ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించారు.

అంతేకాదు మే మొదటి 15 రోజుల్లోనే గతేడాదితో పోలిస్తే పెట్రోల్ సరఫరాలో (Telangana Fuel Supply) 14.2 శాతం, అలాగే డీజిల్ సరఫరాలో 15.7 శాతం మేర నికర వృద్ధిని నమోదు చేసినట్లు అధికారిక గణాంకాలను రిలీజ్ చేశారు. మరోవైపు వేసవిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ లు సహజంగానే కొంత తగ్గుముఖం పట్టాయని తేల్చారు. ఈ సీజన్‌లో ఇది సాధారణ పరిణామమేనని చెప్పారు. వినియోగదారులు ఆందోళన చెంది ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకోవద్దని కోరారు.

Read Also: కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అరవింద్ కామెంట్లతో కొత్త చర్చ !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>