కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అటవీశాఖపై నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిత సమరానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు పచ్చని ఏపీ లక్ష్యంగా హరిత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని, వీటి తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో హరిత సమరానికి సిద్ధం కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని.. జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. దీనికోసం నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించడం, చేతులతో నాటడం వంటి ప్రత్యేక పద్ధతులను ఉపయోగించాలని పేర్కొన్నారు.

