కలం, సెంట్రల్ డెస్క్: Hormuz Crisis | ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు గుణపాఠాన్ని నేర్చుకున్నాయి. కేవలం హర్మూజ్‌మీద ఆధారపడితే కష్టమేనని రియలైజ్ అయ్యాయి. శాశ్వత ఏర్పాట్లు చేసుకోకుంటే ఎప్పటికైనా తిప్పలేనని గుర్తించాయి. యుద్ధంతో ఏ రకంగా సంబంధం లేకపోయినా నష్టపోయామన్న ఆవేదనలో పడ్డాయి. రెండు మూడు దేశాల మధ్య యుద్ధానికి బలిపశువులం అయ్యామనే నిర్వేదానికి గురయ్యాయి. పొరుగు దేశంలోని అనిశ్చితి, అశాంతి ప్రభావం ఇక మీద తమమీద పడొద్దని భావిస్తున్నాయి. అందుకే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాయి. సొంతంగా భూగర్భంలోంచి పైప్‌లైన్ వేసుకోవాలని ఆలోచన చేశాయి. గల్ఫ్ ప్రాంతంలోని దేశాలన్నీ ఇదే తరహాలో ఆలోచించి సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రతీ ఆయిల్ చుక్క విలువను డాలర్లలో లెక్కేసుకుంటున్నాయి. ప్రధాన ఆదాయ వనరైన ముడిచమురు విషయంలో పకడ్బందీ ప్లానింగ్ చేసుకుంటున్నాయి.
ఇరాన్ వార్‌తో నెలకొన్న సంక్షోభం అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది. గ్యాస్, పెట్రోల్ కొరతతో వివిధ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆయిల్ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గల్ఫ్ దేశాలనూ యుద్ధం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. హర్మూజ్ జలసంధిలో ఆంక్షలు రావడంతో ఆయిల్ ఎగుమతి నిలిచిపోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని గల్ఫ్ దేశాలు తలలు పట్టుకున్నాయి. హర్మూజ్ మార్గం క్లోజ్ కావడంతో ఆయిల్ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం భారీగా తగ్గిపోయింది. గల్ఫ్ దేశాలు క్రూడాయిల్, నేచురల్ గ్యాస్ అమ్మకాలతో ఏటా సమకూరే లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇబ్బందుల్లో పడింది. ఈ దేశాల్లోని సుమారు 80% క్రూడాయిల్, గ్యాస్ హర్మూజ్ మీదుగానే రవాణా అవుతుంది.
ఇలాంటి క్లిష్ట సమయాన్ని సౌదీ అరేబియా 1980లోనే ఎదుర్కొన్నది. అప్పట్లో జరిగిన ఇరాన్ యుద్ధంతో సొంతంగా పైప్‌లైన్ మార్గాన్ని నిర్మించుకున్నది. ఇరాన్‌లో సంక్షోభంతో హర్మూజ్ మీదుగా ఆయిల్ ఎగుమతి చేసే దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెల రోజులు దాటినా సేమ్ సీన్. ఆల్టర్నేట్‌గా బెస్ట్ రూట్ కోసం అన్ని గల్ఫ్ దేశాలూ ఆలోచిస్తున్నాయి. పరస్పరం చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతమున్న పైప్ లైన్ మార్గాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, కొత్తగా రోడ్డు, రైల్వే మార్గాలను ఏర్పాటు చేసుకోవడం తదితరాలపై గల్ఫ్ దేశాలు ఫోకస్ పెట్టాయి. హర్మూజ్ శాశ్వతంగా మూతపడినా ఎగుమతులు, దిగుమతుల్లో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా రూట్లను డిజైన్ చేస్తున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే వాటికి బిగ్ రిలీఫ్ దొరుకుతుంది. ‘హర్మూజ్ కు నో ఆల్టర్నేట్’ అనే ప్రస్తుత భావన నుంచి ‘హర్మూజ్ కు ఆల్టర్నేట్ ఉంది’ అనే వైపు అడుగులు పడుతున్నాయి. ఈ రూట్లు ఎక్కడెక్కడున్నాయి? వాటితో కలిగే ప్రయోజనం ఏమిటి? తదితర అంశాలపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ముగ్గురు ఔట్, ఐదుగురు ఇన్
Follow Us On : WhatsApp

