ముంబైని చావబాదడంలో రాహుల్ తోపు: ఆకాష్ చోప్రా

కలం, స్పోర్ట్స్​ : ముంబై ఇండియన్స్‌పై (MI) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడని, శనివారం జరిగే మ్యాచ్‌లో అతను ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కీలకమని టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) విశ్లేషించారు. ఏప్రిల్ 4న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్), ముంబై ఇండియన్స్ తలపడనున్న నేపథ్యంలో చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై జట్టుపై రాహుల్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అతను ఇప్పటివరకు ముంబైపై 69.71 సగటుతో 976 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం విశేషం. గత మ్యాచ్‌లో రాహుల్ డకౌట్ అయినప్పటికీ, ముంబైపై ఉన్న రికార్డుల దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అతను, నిస్సాంక రాణించాల్సిన అవసరం ఉందని చోప్రా పేర్కొన్నారు.

బౌలింగ్ విభాగంలో ఢిల్లీ (DC) జట్టులో మార్పులు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గత మ్యాచ్‌లో ముఖేష్ కుమార్, నటరాజన్‌లతో కలిసి లుంగి ఎన్గిడి అద్భుతంగా రాణించాడని, అందుకే చమీరాకు ప్రస్తుతానికి అవకాశం దక్కకపోవచ్చని తెలిపారు. ఢిల్లీ స్పిన్నర్లు మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌ల్లో ప్రభావం చూపగలరని ఆయన (Aakash Chopra) విశ్లేషించారు. మరోవైపు ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఢిల్లీపై మంచి వికెట్ల రికార్డు ఉన్నప్పటికీ, అరుణ్ జైట్లీ స్టేడియంలో అతని గణాంకాలు అంత ఆశాజనకంగా లేవని చోప్రా గుర్తుచేశారు. అయితే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఈ మైదానంలో బాగా ఆడతారని చెప్పారు. ట్రెంట్ బౌల్ట్‌తో పవర్ ప్లేలో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయించాలని హార్దిక్ పాండ్యాకు సూచించారు. ముంబై బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా ఉందని చెబుతూ, ఇరు జట్లు తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయని ఆయన ముగించారు.

Read Also: సైకిలే వీల్ చైర్ గా మారింది.. ప్రభుత్వాస్పత్రిలో వృద్ధ దంపతుల పాట్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>