కలం, వెబ్ డెస్క్ : ఏపీ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించిన వేళ రాష్ట్రంలో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా రాజధానిగా అమరావతి(Amaravati)ని గుర్తిస్తూ కూటమి ప్రభుత్వం కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలతో మొత్తం 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ మ్యాప్ లో రాష్ట్ర రాజధానిగా అమరావతి అని స్పష్టంగా పేర్కొంది.
కాగా, గతంలో 13 జిల్లాలుగా ఉన్న ఏపీని వైఎస్ జగన్ హయాంలో 26 జిల్లాలుగా మార్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో పోలవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు, అభివృద్ధిని వికేంద్రీకరించే లక్ష్యంతోనే ఈ పునర్విభజన చేపట్టినట్లు కూటమి ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: అమరావతి పునర్నిర్మాణం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

