కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడే జట్టుపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తోంది. కాగా తాజాగా ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సిరీస్ 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు ముందుగా జరగనుంది. ప్రపంచకప్ జట్టులో ఇద్దరికీ చోటు దక్కినప్పటికీ వారి ఫిట్‌నెస్‌పై సందేహాలు తలెత్తుతున్నాయి. వెన్ను గాయం నుంచి కోలుకున్న కమిన్స్.. యాషెస్ మూడో టెస్ట్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. తొలి మ్యాచ్ తర్వాత యాషెస్‌కు దూరమైన హాజిల్‌వుడ్ (Josh Hazlewood).. అఖిలీస్ (Achilles Tendinitis) గాయం నుంచి కోలుకుంటున్నారు.
ఈ విషయంపై ఆస్ట్రేలియా సెలెక్టర్ల చైర్మన్ జార్జ్ బైలీ స్పందించాడు. పాకిస్థాన్ సిరీస్‌కు కమిన్స్, హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. అయితే ప్రపంచకప్ సమయానికి ఇద్దరూ సిద్ధంగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ట్రావిస్ హెడ్ మాదిరిగా కమిన్స్ కూడా టోర్నీ రెండో భాగంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉందని బైలీ తెలిపారు. హాజిల్‌వుడ్ టోర్నీ ప్రారంభానికి సిద్ధంగా ఉంటాడని, టిమ్ డేవిడ్ కూడా పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని చెప్పారు. పాకిస్థాన్ సిరీస్ జట్టు ఎంపికకు బిగ్ బాష్ లీగ్‌లో రాణిస్తున్న ఆటగాళ్లను కూడా పరిశీలిస్తామని బైలీ వెల్లడించారు.

Read Also: ఇండియా స్క్వాడ్‌లోకి గిల్, అయ్యర్ కంబ్యాక్
Follow Us On: Pinterest


