ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని బిలాస్‌పుర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 6 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. లాల్‌ఖదాన్ ప్రాంతంలో, గటోరా-బిలాస్‌పుర్ రైల్వే స్టేషన్ల మధ్య జైరామ్‌నగర్ సమీపంలో మెము ప్యాసింజర్-గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ప్యాసింజర్ రైలు.. బోగీ మాల్గూడ్స్ రైలు మీదకు ఎక్కింది. పలు బోగీలు పట్టాలు తప్పాయి. మహిళల రిజర్వ్డ్ బోగీలు ఎక్కువగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
స్తంభించిన రైల్వే సేవలు
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) ఈ ఘటనతో బిలాస్‌పుర్(Bilaspur)-హావ్‌డా, బిలాస్‌పుర్-కట్నీ మార్గాల్లో రైళ్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రయాణికులకు బస్సుల ద్వారా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే రెస్క్యూ టీమ్స్, ఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసు, వైద్య బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తరుణ్ ప్రకాశ్, బిలాస్‌పుర్ డిఆర్‌ఎం రాజ్‌మల్ ఖోయివాల్ స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. దెబ్బతిన్న బోగీలను పట్టాల నుంచి తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు చంపా జంక్షన్: 808595652, రాయ్‌గఢ్: 975248560, పెంద్రా రోడ్: 8294730162 సైట్-స్పెసిఫిక్: 9752485499, 8602007202 నంబర్లలో సంప్రదించాలని రైల్వే అధికారులు కోరారు.
Read Also: తులం బంగారం హామీపై కాంగ్రెస్ చేతులెత్తేసినట్టేనా? మంత్రి వ్యాఖ్యలతో గందరగోళం
Follow Us On : Instagram

