కలం, వెబ్‌డెస్క్: వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఓ తల్లిదండ్రులు తమ కుమార్తెపై క్షుద్రపూజలు చేయడం కలకలం రేపింది. తాండూరు పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తమ కుమార్తెపై క్షుద్ర పూజలు చేయడానికి అసలు కారణం తెలుసుకున్న వారంతా షాకయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. తాండూరు పట్టణానికి చెందిన ఓ దంపతులు ఒక మంత్రగాడిని ఆశ్రయించారు. తమ కుమార్తె ఒకరిని ప్రేమించిందని, అతడిని మరిచిపోయేలా చేయాలని మంత్రగాడిని కోరారు. సదరు మంత్రగాడు ఇందు కోసం క్షుద్ర పూజలు చేయాలని, ఇంట్లోనే ఏర్పాట్లు చేయండని చెప్పాడు.
మంత్రగాడి సలహాతో సదరు దంపతులు ఇంట్లోనే క్షుద్రపూజలు, చేతబడి చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఇంట్లోకి వెళ్లి యువతి తల్లిదండ్రులను ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న క్షుద్రపూజలపై నిలదీశారు. వారు చెప్పిన సమాధానం విని ఆగ్రహంతో మంత్రగాడిని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఆధునిక కాలంలో కూడా క్షుద్రపూజలు, చేతబడులు నమ్మడం, సొంత కూతురిపైనే ఇలా దారుణంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
Follow Us On: WhatsApp

