కలం, వెబ్ డెస్క్ : మే ఒకటి నుంచి సామాన్యులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ (Commercial LPG Gas) ధర ఏకంగా 993 రూపాయలు పెరగడం గమనార్హం. దీనితో ఢిల్లీలో సిలిండర్ ధర 3,071 రూపాయలకు చేరుకుంది. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే స్థాయి పెరుగుదల కనిపిస్తోంది. పాత ధర 2,106 రూపాయలు ఉండగా ఇప్పుడది 3,099 రూపాయల వద్దకు చేరింది. వాణిజ్య సిలిండర్ ధరలు చరిత్రలో మొదటిసారిగా మూడు వేల మార్కును దాటడం విశేషం.
చిన్న వ్యాపారులు వినియోగించే 5 కిలోల ఎఫ్టీఎల్ సిలిండర్ ధర కూడా 241 రూపాయలు పెరిగింది. గతంలో 592 రూపాయలు ఉన్న ఈ సిలిండర్ ఇప్పుడు 833 రూపాయలకు లభించనుంది. హోటళ్లు, క్యాటరింగ్ రంగాలపై ఈ భారం తీవ్రంగా పడనుంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. డొమెస్టిక్ సిలిండర్ యథాతథంగా 916.50 రూపాయల వద్దే కొనసాగుతోంది.
Read Also: పోలవరం భవితవ్యంపై నేడు కీలక సమావేశం..
Follow Us On: WhatsApp

