పోలవరం భవితవ్యంపై నేడు కీలక సమావేశం..

కలం, వెబ్‌ డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనుల వేగవంతం దిశగా కేంద్ర జలశక్తి శాఖ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం తోపాటు అత్యంత కీలకమైన పునరావాస కార్యక్రమాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేడు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ఎదురవుతున్న సవాళ్లను ప్రధానంగా విశ్లేషించనున్నారు.

ముఖ్యంగా ఎగువ రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, ముంపు ప్రభావం వంటి సున్నితమైన అంశాలపై అధికారులు దృష్టి సారించనున్నారు. బాధితులకు అందాల్సిన పరిహారం, కాలనీల నిర్మాణంపై చేపట్టాల్సిన తదుపరి చర్యలను ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తోపాటు ఇతర ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొని రాష్ట్ర వాదనను బలంగా వినిపించనున్నారు. ప్రాజెక్టు (Polavaram Project) నిధుల విడుదల, సాంకేతిక అనుమతుల విషయంలో ఈ భేటీ అత్యంత కీలకంగా మారనుంది.

Read Also: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌డ‌వ ప్ర‌మాదం.. ఏడుగురు ప‌ర్యాట‌కులు మృతి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>