కలం, నల్లగొండ బ్యూరో : ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం రూ.6వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి (ACB) చిక్కాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుబండకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణ పర్మిషన్ కోసం పంచాయతీ కార్యదర్శి బర్పటి కృష్ణను సంప్రదించాడు. పర్మిషన్ ఇవ్వాలంటే రూ.6వేలు లంచం ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని సంప్రదించాడు. జిల్లా ఏసీబీ (ACB) డీఎస్పీ జగదీష్ చంద్రతో పాటు అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం బర్పటి కృష్ణ సదరు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణను కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.
Read Also: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
Follow Us ON : Twitter


