కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. నిరుడు డిసెంబర్ 10 నుంచి 21 వరకు ఏపీ టెట్ (AP TET) పరీక్షలు జరిగాయి. మొత్తం 2.4లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 97,560 (39.27 శాతం) మంది పాస్ అయినట్లు టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ పరీక్ష రాసిన 31,886 మంది ఇన్సర్వీస్ టీచర్లలో 15,239 మంది పాస్ అయ్యారని చెప్పారు. ఫలితాలను https://tet2dsc.apcsfsss.in లో చూసుకోవచ్చు. కాగా, ఏపీ టెట్ పరీక్ష సంబంధించి మొదట కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది కీ, ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also: సీనియర్ జర్నలిస్టు ఫజల్ మృతి
Follow Us On: Twitter


