కలం, వెబ్‌డెస్క్: ఆధార్, పాన్ లింక్ (PAN Aadhaar Linking) చేయనివాళ్లకు అలెర్ట్. లింక్ గడవు ఈ నెల 31తో అయిపోతోంది. ఆ లోగా లింక్ చేయకపోతే పాన్ సేవలు ఆగిపోయే ప్రమాదముంది. అదే జరిగితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పాన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్‌తో అనుసంధానం అయ్యిందో లేదో చూసుకోండి. నిజానికి ఆధార్–పాన్ అనుసంధానాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రెండేళ్ల కిందటే తప్పనిసరి చేసింది. నకిలీ పాన్లను నిరోధించేందుకు ఈ విధానం తీసుకొచ్చింది. దీంతో చాలా మంది అప్పట్లోనే నిర్దేశిత గడువులోగా ఆధార్, పాన్ లింక్ చేయించుకున్నారు. చేయించనివాళ్ల పాన్లు నిలిచిపోయాయి. అలాంటి పాన్లను కూడా ఆధారాలతో, రూ.వెయ్యి పెనాల్టీ కట్టి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు తిరిగి పాన్ చేస్తుంది.
లింక్ చేయకపోతే ఏమవుతుందంటే..:
ఆధార్–పాన్ లింక్ (PAN Aadhaar Linking) చేయకపోతే.. ఇన్‌కమ్‌టాక్స్ రిటర్నులు కట్టలేరు. రావాల్సిన రీఫండ్లు నిలిచిపోతాయి. పెండింగ్ రిటర్నులను ప్రాసెస్ చేయరు. అలాగే బ్యాంకు లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్ట్‌మెంట్స్‌పై టీడీఎస్ పన్ను కోత ఎక్కువ పడుతుంది. రూ.50వేల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయడం కష్టం. డీమ్యాట్ ఖాతాలకు కేవైసీ చేయలేరు. లోన్స్, రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.
లింక్ ఎలా చేసుకోవాలంటే..:
మొదట www.incometax.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోని క్విక్ లింక్ సెక్షన్లో ‘లింక్ ఆధార్’ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో మన పాన్, ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి. వివరాలన్నీ నమోదు చేశాక, ఐ అగ్రీ అనే బాక్స్‌పై క్లిక్ చేయాలి. పెనాల్టీ కట్టాల్సినవాళ్లు రూ.వెయ్యి చెల్లించాలి. దీనికోసం పాన్ నెంబరును ఓటీపీతో కన్ఫామ్ చేస్తే ఇ–పే ట్యాక్స్ పేజీకి వెళుతుంది. అక్కడ 2025–26 సంవత్సరాన్ని ఎంచుకోవాలి. అందులో డీటైల్స్ ఎంటర్ చేయాలి. పెనాల్టీ ఎంతో చూపించిన తర్వాత కంటిన్యూ చేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ వంటివి ఎంచుకొని పెనాల్టీ చెల్లించాలి. వెంటనే చలాన్ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ ‘లింక్ ఆధార్’ సెక్షన్‌కు రావాలి. పాన్, ఆధార్ నెంబర్లు, ఓటీపీ ఎంటర్ చేసి ధ్రువీకరిస్తే లింక్ అయిపోయినట్లే.
ఎలా చెక్ చేయాలి?
ఆధార్, పాన్ లింక్‌ను ఒకవేళ ముందే చేసి ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇన్‌కమ్‌టాక్స్ వెబ్సైట్లోకి ‘లింక్ ఆధార్ స్టేటస్’పై క్లిక్ చేయాలి. ఆధార్, పాన్ వివరాలు ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఇప్పటికే లింక్ పూర్తయ్యి ఉంటే అందులో కనిపిస్తుంది. లేదంటే ‘మీ వివరాలు ఉడాయ్ వాలిడేషన్‌కు పంపించాం’ అని మెసేజ్ వస్తుంది.
Read Also: రెండు రోజుల్లో లక్ష డౌన్‌లోడ్‌లు.. ‘యూరియా యాప్’తో 60 వేల యూరియా బస్తాలు
Follow Us On: Instagram


