కలం స్పోర్ట్స్: గేమ్ ఏదైనా వరల్డ్ కప్ అంటే ప్లేయర్స్ అంతా అలెర్ట్ అవుతారు. తమ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడతారు. కానీ 2026 వరల్డ్‌కప్‌కు ముందు స్టార్ ఆటగాడు మోకాలి సర్జరీ చేయించుకుంటే.. ఆ జట్టు కాస్తంత గందరగోళంలో పడుతుంది. కానీ బ్రెజిల్ మాత్రం.. ఇంకా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఫిఫా వరల్డ్ కప్ 2026లో తమ జట్టు మరింత అద్భుతంగా రాణిస్తోందని ధీమా వ్యక్తం చేస్తుంది. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్(Neymar) తాజాగా ఎడమోకాలి సర్జరీ చేయించుకున్నాడు. కాబట్టి.. వరల్డ్ సమయానికి అతడు పూర్తిగా రికవర్ అవుతాడని, టోర్నీలో అరగొడతాడని బ్రెజిల్ ధీమాగా ఉంది.
అయితే నెయ్‌మార్(Neymar) కొంతకాలంగా ఎడమ మోకాల్లోని మెనిస్కస్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా దానికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని అతని క్లబ్ సాంటోస్ అధికారికంగా ప్రకటించింది. 33 ఏళ్ల నెయ్‌మార్ గాయంతోనే సీజన్ మొత్తం ఆడాడు. అంతేకాకుండా సాంటోస్ జట్టును బ్రెజిల్ అగ్ర లీగ్ నుంచి పతనమవకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కారణంగా అతనికి ఈ సీజన్ కాస్తంత కష్టంగా మారింది.
బ్రెజిల్ జాతీయ జట్టు వైద్యుడు నెయ్‌మార్‌కు ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేశాడు. ఇదివరకే నెయ్‌మార్‌కు పాదం విరిగిన గాయానికి, అలాగే 2023 అక్టోబర్‌లో ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఎసిఎల్ (ACL) గాయానికి కూడా అతనే సర్జరీ చేశాడు. సర్జరీ తర్వాత నెయ్‌మార్ పూర్తిగా కోలుకోవడానికి సుమారు ఒక నెల సమయం పట్టే అవకాశం ఉందని క్లబ్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరితో సాంటోస్‌తో అతని ఒప్పందం ముగియనుండగా, కొత్త ఒప్పందంపై క్లబ్‌తో చర్చలు కొనసాగుతున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా బ్రెజిల్ జట్టుకు దూరంగా ఉన్న నెయ్‌మార్, పూర్తిగా కోలుకుని 2026 ఫిఫా ప్రపంచకప్‌కు సిద్ధమవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కోచ్ కార్లో అన్చెలొట్టి ప్రణాళికల్లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నాడు. బ్రెజిల్ తరఫున 128 మ్యాచ్‌ల్లో 79 గోల్స్ సాధించిన నెయ్‌మార్, దేశ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ జూన్ 11 నుంచి మెక్సికో, అమెరికా, కెనడాల్లో ప్రారంభం కానుంది.
Read Also: రోహిత్ వర్సెస్ స్మృతి మంధానా.. ఎవరి స్టాట్స్ ఎలా ఉన్నాయంటే..!
Follow Us On: X(Twitter)


