కలం, వెబ్ డెస్క్: భారత ప్రధాని మోదీకి (Narendra Modi) నార్వే దేశం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ ను అందించింది. మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఓస్లో నగర పర్యటనలో ఉన్న సందర్భంగా ఈ గౌరవం దక్కింది. భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ సంబంధాల వృద్ధిలో ఆయన చూపిన చొరవకు గుర్తింపుగా నార్వే రాజు హెరాల్డ్ ఈ పురస్కారాన్ని అందజేశారు. విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి మోదీ అందుకున్న 32వ అంతర్జాతీయ గౌరవం ఇది కావడం విశేషం. గత 43 ఏళ్లలో ఓ భారత ప్రధానమంత్రి నార్వేలో (Norway) పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందిస్తూ, ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది భారత్-నార్వే దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధానికి, ప్రపంచ పురోగతిపై ఉన్న ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిక్ రీసెర్చ్, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడింది.
Read Also: ప్రపంచ వేదికపై భారత్ స్థాయి పెరిగింది : రాజ్‌నాథ్ సింగ్
Follow Us On: WhatsApp

