కలం, వెబ్ డెస్క్ : యాంకర్ అనసూయ, యూట్యూబర్ అన్వేష్ వివాదంపై తాజాగా రాధా మనోహర్ దాస్ (Radha Manohar Das) స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పారు. దేవుడు మనిషికి మాత్రమే ఇంకిత జ్ఞానం అనేది ఇచ్చాడని దాన్ని సరిగ్గా వాడుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. అనసూయ లాంటివాళ్ళు మంచి ఫ్యామిలీలో పుట్టి ఇలా ప్రవర్తిస్తాం అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలని చెప్పారు రాధా మనోహర్ దాస్ .
కానీ ప్రజల్లో ఉన్నంతకాలం నైతికతను మర్చిపోవద్దు అని చెప్పారు. సంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి పక్కన పెడితే.. కనీసం నైతికతతో ప్రజల్లో మెదలాలని సూచించారు. ఎవరికైనా మంచి చెపుతాం కానీ వినకుంటే వాళ్ళని ఏమీ చేయలేమన్నారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మిగతాది ఆ భగవంతుడే చూసుకుంటారని తెలిపారు. కామన్ సెన్స్ తో ఆలోచించి పదిమందికి ఆదర్శంగా నిలవాలని రాధా మనోహర్ దాస్ (Radha Manohar Das) సూచించారు.
Read Also: విశ్వక్ సేన్ పొలిటికల్ డ్రామా ‘లెగసీ’
Follow Us On : WhatsApp


